చింతపల్లి: బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

54చూసినవారు
చింతపల్లి: బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
చింతపల్లి: దైవచింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. బుధవారం మదనాపురంలో జరుగుతున్న శ్రీశ్రీ లక్ష్మీ నర్సింహా స్వామి బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొని పూజలు నిర్వహించారు. లక్ష్మీ నర్సింహా స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంజీవరెడ్డి, పవన్, ఇతర నేతలు, మాజీ ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ వారు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్