నల్లగొండ: ప్రశాంతంగా డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు

78చూసినవారు
నల్లగొండ: ప్రశాంతంగా డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు
మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బుధవారం డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1: 00 గంట వరకు 6వ సెమిస్టర్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 1వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షలు జరిగాయి. దేవరకొండలోని ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉదయం 6వ సెమిస్టర్ పరీక్షలో ఓ విద్యార్థిని మాల్ ప్రాక్టీస్ పాల్పడుతుండగా స్క్వాడ్ బృందం గుర్తించి డీబార్ చేసింది.

సంబంధిత పోస్ట్