దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు శుక్రవారం టిఆర్ఎస్ నాయకుడు వడ్త్యా రమేష్ ఆర్ధిక సహాయం చేశారు. దీనిని పదో తరగతి విద్యార్థులకు స్టడీ అవర్స్ లో ఇచ్చే స్నాక్స్ కు వినియోగించాలని ఆయన కోరారు. పేద విద్యార్థులకు నా వంతు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందు ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్. ఎం. నర్సింహారెడ్డి, ఉపాధ్యాయులు పి. శ్రీను, డి. దామోదర్, తదితరులు పాల్గొన్నారు.