దేవరకొండ నియోజకవర్గంలో మంగళవారం రాష్ట్ర ఆహార కమిషన్ బృందం పర్యటించింది, రేషన్ షాప్, అంగన్వాడి, స్కూల్స్, హాస్టళ్లలో ఏరియా ఆసుపత్రిలో తనిఖీలు చేసి చిన్న చిన్న సమస్యలు మినహా జాతీయ ఆహార భద్రత చట్టం పకడ్బందీగా అమలవుతుందన్న చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆయన వెంట కమిషన్ సభ్యులు, ఆర్డీవో రమణారెడ్డి, తహసిల్దార్ సంతోష్ కిరణ్, డిటి శ్రీనివాస్ గౌడ్, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు.