పెద్ద అడిశర్లపల్లి మండలంలోని అజ్మా పురంకి చెందిన గడిగ బాలకృష్ణ గ్రూప్-1 నందు 400 మార్కులు సాధించగా, గ్రూప్-2 నందు రాష్ట్రస్థాయిలో 371 మార్కులతో 442 ర్యాంకు సాధించాడు. గ్రూప్-3లో రాష్ట్ర స్థాయిలో 285 మార్కులతో 381 ర్యాంకు సా ధించాడు. సాధారణ కుటుంబా నికి చెందిన గడిగ బాలయ్య, కళమ్మ కుమా రుడైన బాలకృష్ణ గ్రూప్-4 పరీక్ష రాసి ప్రస్తుతం తాల్లవెల్లంల నందు పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.