దేవరకొండలోని ఎల్ఐసీ ఆఫీస్ ఎదురుగా లయన్స్ క్లబ్, ఎల్ఐసీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎల్ఐసీ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్. రాము చౌహన్ తో కలిసి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వస్కుల సత్యనారాయణ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. చలివేంద్రాలని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, రాజేష్, బుచ్చయ్య శ్రీనివాస్, రుక్మారెడ్డి గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.