దేవరకొండ మండలం గొట్టిముక్కల యుపిఎస్ పాఠశాలలో శుక్రవారం పేరెంట్ టీచర్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హెచ్ఎం సరిత మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి గ్రామస్తులు సహకరించాలని కోరారు. అనంతరం నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో కొత్తగా ఒకటవ తరగతిలో చేరిన విద్యార్థులతో అక్షరాలు దిద్దించారు. ఎఎపీసీ సాయిలమ్మ, మాజీ సర్పంచ్ అయ్యన్న, ఉప సర్పంచ్ లింగయ్య, సెక్రటరీ శంకర్, ఉపాధ్యాయులు హాజరయ్యారు.