ప్రజా పాలనలో మారుమూల పల్లెలు, తండాలకూ ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తామని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. శుక్రవారం దేవరకొండ ఆర్టీసీ డిపో నుండి రేకులగడ్డ యాపలపాయ తండాకు నూతనంగా ఏర్పాటు చేసిన బస్సు సర్వీసును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ రూట్లోని ప్రయాణీకులు ఆర్టీసీ బస్ సేవలను వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అలంపల్లి, డిఎం రమేష్ బాబు, సిరాజ్ ఖాన్, పున్న, తదితరులు పాల్గొన్నారు.