దేవరకొండ: అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

83చూసినవారు
దేవరకొండ: అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
దేవరకొండ: పదేళ్లుగా ఎదురుచూస్తున్న పేదోడి సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నిజం చేసిందని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. గురువారం సూర్యతండా, పురపాలికలోని అయ్యప్ప నగర్ లలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, పలువురు నేతలు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్