ప్రభుత్వం తక్షణమే పెండింగ్ లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేయాలని యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు సౌభాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం దేవరకొండలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యారంగ సమస్యలపై గత ప్రభుత్వంలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పండు, నితిన్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.