దేవరకొండ: అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు పల్లా వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలో జరిగిన నియోజకవర్గ సీపీఐ కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలం అయిందన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, నరసింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.