అర్హులైన వారికే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని బీజేపీ మండలశాఖ ఆధ్వర్యంలో బుధవారం ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇళ్ళను ఇస్తామని చెప్పినా, గ్రామాల్లో అధికార పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సురేష్, నర్సింహా, రాము నాయక్, అంజయ్య, చండీశ్వర్, తదితరులు పాల్గొన్నారు.