వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం దేవరకొండ నియోజకవర్గంలోని పలు దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. వేకువజామునే ఆలయాలల్లో బారులు తీరిన భక్తులు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. దేవరకొండ పట్టణంలోని గరుడాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే బాలు నాయక్ స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి, సిరాజ్ ఖాన్, పున్న, మాధవ రెడ్డి తదితరులు ఉన్నారు.