
ఢిల్లీలో అసలైన విజేతలు ప్రజలే: మోదీ
బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఢిల్లీని వికసిత రాజధానిగా మార్చే అవకాశాన్ని ప్రజలు బీజేపీకి ఇచ్చారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయమని మోదీ అన్నారు. 'ఆప్ నుంచి ముక్తి లభించడంతో ఢిల్లీ ప్రజలు సంతోషంగా ఉన్నారు. వారు చూపించిన ప్రేమను అభివృద్ధి రూపంలో తిరిగిస్తాం. అభివృద్ధి చేసి ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటాం. ఢిల్లీలో అసలైన విజేతలు.. ప్రజలే' అని అన్నారు.