దేవరకొండ: గత నాలుగు దశాబ్దాలుగా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించిన తనను మరోసారి ఎమ్మెల్సీగా గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ అన్నారు. మంగళవారం పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిఏ బకాయిలు, మెరుగైన పిఆర్సి కోసం కృషి చేసి ఉపాధ్యాయులకు అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో సదానంద్ గౌడ్, కృష్ణుడు, పర్వత రెడ్డి, నగేష్, కరుణాకర్ రెడ్డి, రవికుమార్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.