దేవరకొండ: ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది

85చూసినవారు
దేవరకొండ: ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది
ఈనెల 27న వరంగల్ లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభను జయప్రదం చేయాలని మాజీమంత్రి జగదీశ్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం దేవరకొండలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఏర్పడ్డ వ్యతిరేకతను చూస్తుంటే మా పార్టీ సభ ప్రభుత్వ వ్యతిరేక సభగా మారేలా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రవీంద్ర, బిల్యా, రమేష్, టీవీఎన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్