దేవరకొండ: బీసీ జనాభాపై ప్రభుత్వం తప్పుడు సర్వే లెక్కలు మానుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి వినతిపత్రం అందించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాస్కరాచారి, కృష్ణచారి, లలితా బాయ్, కోటేష్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.