ఉచిత వైద్య శిబిరం

77చూసినవారు
ఉచిత వైద్య శిబిరం
దేవరకొండ మండల పరిధిలోని కట్టకొమ్ముతండాలో మంగళవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కంటితోపాటు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. పేదలకు లయన్స్ క్లబ్ వైద్యం పరంగా ఎప్పుడూ అండగా ఉంటుందని అధ్యక్షుడు సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్