కొండమల్లేపల్లి కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కళాశాలలో ఇంగ్లీష్ మీడియంలో తాత్కాలిక పద్ధతిలో విద్యాబోధన చేసేందుకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు స్పెషల్ ఆఫీసర్ సరళ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటని, జువాలజీ, ఎంఎల్టి సబ్జెక్టుల్లో పీజీ, బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, మరిన్ని వివరాలకు 8328121148 సంప్రదించాలన్నారు.