Top 10 viral news 🔥

అంతర్జాతీయ క్రికెట్లో 600 వికెట్లు తీసిన 5వ భారత బౌలర్గా జడ్డూ
భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఓ అరుదైన రికార్డ్ సాధించాడు. ఇంగ్లాండ్తో ఇవాళ జరిగిన మ్యాచ్లో మూడు వికెట్లు తీసిన జడ్డూ.. అంతర్జాతీయ క్రికెట్లో మొత్తంగా 600 వికెట్లు తీసిన 5వ భారత బౌలర్గా, 4వ భారత స్పిన్నర్ గానూ ఘనత సాధించాడు. భారత్ తరఫున అనిల్ కుంబ్లే 953 వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ 765 వికెట్లు, హర్భజన్ సింగ్ 707 వికెట్లు, కపిల్ దేవ్ 687 వికెట్లు తీసి జడేజా కంటే ముందున్నారు.