నల్గొండ జిల్లా డిండి 1 అంగన్వాడి కేంద్రంలో మంగళవారం పోషకాహారం తీసుకోవాల్సిన అవసరంపై గర్భవతులు, బాలింతలు, మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోషణ అభియాన్ మాసోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమంలో జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కేంద్రం టీచర్ బల్ముల చంద్రకళ, అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.