
పిడుగురాళ్ల, తునిలో రెండోసారి ఎన్నిక వాయిదా
AP: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ఇచ్చే బీఫామ్‌ను నిన్న సకాలంలో అందజేయలేదు. సభ్యులూ హాజరుకాలేదు. ఇవాళ ఐదుగురు కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు. కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. మరోవైపు కాకినాడ జిల్లా తుని పురపాలక వైస్ చైర్మన్ పదవి ఎన్నిక కూడా వాయిదా పడింది. శాంతి భద్రతల సమస్యకు ఆస్కారం ఉండటంతో అధికారులు ఎన్నిక వాయిదా వేశారు.