నల్గొండ జిల్లా పెద్ద అడిషర్లపల్లి మండల నూతన తహశీల్దారుగా జయశ్రీ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పని చేసిన తహశీల్దార్ శ్రీనివాసరావు కలెక్టరేట్ కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా నూతన తహశీల్దార్ మాట్లాడుతూ మండలంలో నెలకొన్న రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు.