దేవరకొండ మండలం కొమ్మపల్లి ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం తొలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించుకున్నారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించి, ఆమె సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం పొట్ట ప్రేమయ్య, టీచర్లు ఎం. తార, కేశబోయిన రవీందర్, హాఫిజా, చింతపల్లి సంతోష పాల్గొన్నారు.