ప్రభుత్వ పాఠశాలలో ఫీజుల భారం ఉండదని, అనుభవజ్ఞలైన ఉపాధ్యాయులు, వసతులు అందుబాటులో ఉంటాయని కొండ మల్లేపల్లి ఎంఈఓ నాగేశ్వర్ నాయక్ అన్నారు. మంగళవారం చింత చెట్టు తండాలో నిర్వహించిన బడి బాట ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ర్యాలీలో గాజీ నగర్ హెచ్ఎం చినముత్యాలు మరియు ఉపాధ్యాయలు పాల్గొని, ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను ప్రోత్సహించారు.