టి 20 ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధించి విజేతగా నిలవడంతోపాటు, 14 సంవత్సరాల తర్వాత భారత్ టి 20 ప్రపంచకప్ గెలిచిన సందర్భంగా శనివారం అర్ధరాత్రి దాటాక కొండమల్లేపల్లి చౌరస్తాలో యువకులు బాణసంచా కాల్చి జాతీయ జెండాలు ప్రదర్శిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కొండమల్లేపల్లి గ్రామస్థులు పాల్గొన్నారు.