కల్వలపాలెంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

70చూసినవారు
కల్వలపాలెంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం కల్వల పాలెం గ్రామంలో సోమవారం అంబేద్కర్ జయంతి భీమ్ సేన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలో పెద్దలు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు అందరం కొనసాగించాలని ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీమ్ సేన్ యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.