మహిళా ఎమ్మెల్యేలపట్ల సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడుతూ సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితతో పాటు మరో మహిళా ఎమ్మెల్యే సునీత పట్ల అసెంబ్లీలో సీఎం, డిప్యూటీ సీఎంలు చేసిన వ్యాఖ్యలు గర్హనీయమన్నారు. వారికిబేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేదంటే ప్రజలేతగిన గుణపాఠం నేర్పు తారని హెచ్చరించారు.