రాగడప ఎస్సీ కాలనీ లో విద్యుత్ ఇబ్బందులు

0చూసినవారు
రాగడప ఎస్సీ కాలనీ లో విద్యుత్ ఇబ్బందులు
త్రిపురారం మండలం రాగడప గ్రామంలోని ఎస్సీ కాలనీలో విద్యుత్ సమస్యలు ముదురుతున్నాయి. 4 నెలల క్రితం ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటైనప్పటికీ ఇప్పటివరకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లైన్‌మెన్ మోతిలాల్, ఏఈ బాలను అనేకసార్లు విజ్ఞప్తి చేసినా కనెక్షన్ నిక్షేపంగా ఇవ్వలేదని వాసులు వాపోతున్నారు. కనీస సౌకర్యాల కోసం కూడా అధికారులు స్పందించకపోవడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్