హాలియాకు చెందిన ఎన్సీఎం ఫౌండేషన్ ఆధ్వర్యంలో భీమవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 20 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లు, పెన్నులు, పెన్సిల్స్ లను గురువారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు బిక్షమయ్య పంపిణీ చేశారు. పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు వార్షిక పరీక్షలకు హాజరవుతున్న సందర్భంలో ఎన్సీఎం ఫౌండేషన్ చైర్మన్ నల్లగొండ ఆంజనేయులు విద్యార్థిని విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని అందజేశారని తెలిపారు.