మిర్యాలగూడ పట్టణంలోని జ్యోతి ఆసుపత్రిలో ఉట్లపల్లి గ్రామానికి చెందిన ఓ గర్భిణీ మహిళకు శస్త్ర చికిత్సకోసం ఏ పాజిటివ్ రక్తం అత్యవసరం అవ్వగా, పేషెంట్ కుటుంబ సభ్యులు మేధ ఫౌండేషన్ వారిని బుధవారం సంప్రదించారు. సమాచారం తెలుసుకున్న సంస్థ కో-ఫౌండర్ కనుకుంట్ల నాగరాజు వెళ్లి రక్తదానం చేసారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ఇప్పటికీ 35వ సారి రక్తదానం చేయడం జరిగిందని, యువకులు రక్తదానానికి ముందుకురావాలని కోరారు.