మిర్యాలగూడ: 55వ సారి రక్తదానం చేసిన యువకుడు

54చూసినవారు
మిర్యాలగూడ: 55వ సారి రక్తదానం చేసిన యువకుడు
మిర్యాలగూడ మండల కేంద్రంలోని జ్యోతి ఆసుపత్రిలో ఓ వ్యక్తికి శస్త్ర చికిత్స కోసం ఏ పాజిటివ్ రక్తం అత్యవసరం అయ్యింది. కాగా పేషెంట్ కుటుంబ సభ్యులు మేధ ఫౌండేషన్ సహా వ్యవస్థాపకులు నాగరాజును సంప్రదించారు. తను తెలిపిన సమాచారం మేరకు హెల్పింగ్ హాండ్స్ వ్యవస్థాపకులు రాం వంశీ యాదవ్ స్పందించి సోమవారం వెళ్లి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ 55వ సారి రక్తదానం జరిగిందని, యువత రక్తదానానికి ముందుకు రావాలన్నారు.

సంబంధిత పోస్ట్