మిర్యాలగూడ: పట్టణానికి మంజూరైన ఫ్లైఓవర్లను నిర్మాణ పనులను తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేస్తూ శనివారం సీపీఎం ఆధ్వర్యంలో పట్టణంలో పాదయాత్ర నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఇతర నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.