సావిత్రిబాయి ఫూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేయడం పట్ల బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాపోలు పరమేశ్ హర్షం వ్యక్తం చేశారు. గురువారం మిర్యాలగూడలో ఆయన మాట్లాడుతూ అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన సాద్వీమణి అని అన్నారు.