రాష్ట్రంలో విస్తరించనున్న మంత్రివర్గ విస్తరణలో బంజారాలకు అవకాశం కల్పించాలని బంజారా సంఘం, బంజారా ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన సంఘం సమావేశంలో బంజారా సంఘం తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరథ్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో బంజారాలు 10 శాతం వున్నారని, ఒక్క శాతం కూడా లేని గిరిజనుల్లోని ఇతర కులాల వారికి అవకాశం కల్పించి 10 శాతం వున్న బంజరాలను విస్మరించడం తగదన్నారు.