మిర్యాలగూడెం: గ్రూప్ వన్ ర్యాంకర్ అశోక్ కు అభినందన

79చూసినవారు
మిర్యాలగూడెం: గ్రూప్ వన్ ర్యాంకర్ అశోక్ కు అభినందన
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 1 పరీక్షలో రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ సాధించిన తేజవత్ అశోక్ నాయక్ ను బంజారా ఉద్యోగుల సంఘం, బంజారా సంఘం ఆధ్వర్యంలో గురువారం స్థానిక అమరవీరుల స్తూపం వద్ద శాలువా, బొకెతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బంజారా ఉద్యోగుల సంఘం నాయకులు జైత్రం నాయక్, దశరథ్ నాయక్ లు మాట్లాడుతూ నిరుపేద వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన అశోక్ నాయక్ రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరచడం అభినందనీయమన్నారు.

సంబంధిత పోస్ట్