ఎస్సిల ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల మాదిగ సంఘాల ప్రతినిధులు గురువారం హర్షం వ్యక్తం చేశారు. 35వ వార్డ్ కౌన్సిలర్ కొమ్ము శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం వద్ద మాదిగ అమరులకు నివాళులు అర్పించి మందకృష్ణ మాదిగ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి మాట్లాడారు. వర్గీకరణతోనే మాదిగల అభివృద్ధి సాధ్యమని మందకృష్ణ నాయకత్వంలో 30ఏండ్లు వర్గీకరణ ఉద్యమం జరిగిందన్నారు.