సింగరేణి ప్రైవేటీకరణను ఆపాలని, అవసరమైతే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం స్థానిక సిపీఎం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వేలాది కుటుంబాలకు జీవనాధారమైన సింగరేణిని కేంద్రప్రభుత్వం ప్రైవేటీకరిస్తే కార్మికులకుటుంబాలు వీధిన పడతాయన్నారు. ప్రజాభిప్రాయాలను సేకరించకుండా ఏకపక్షంగా సింగరేణి ప్రైవేటీకరణచేస్తే సహించేదిలేదన్నారు.