మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆర్డీవో కార్యాలయం ఎదుట విద్యార్థులతో కలిసి ధర్నా చేసి మాట్లాడారు. పాఠశాలలో తెలుగు హిందీ సోషల్ టీచర్ల ఖాళీలను కలెక్టర్ భర్తీచేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కుర్ర సైదా నాయక్, జగన్, నుమన్, ప్రసన్న పాల్గొన్నారు.