భూభారతి చట్టం దేశానికే రోల్ మోడల్ అని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆయన మంజూరు పత్రాలు అందజేశారు. భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమంలో భాగంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో భూభారతి చట్టం కాంగ్రెస్ పార్టీకి రెఫరెండం లాంటిదని పునరుద్ఘాటించారు. భూ సమస్యలు పరిష్కరించామని చెప్పారు.