బంజారా ఆరాధ్య దైవం సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ట్రాక్టర్ యూనియన్ కమిటీని గురువారం ఏర్పాటు చేశారు. త్రిపురారం మండలం పరిధిలోని వయా రూప్లాతండా, కూన్యతండా హర్జ్యతాండా, డొంకతండా, కాన్యతండా 5 గ్రామాలు ఓనర్స్ డ్రైవర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీలో హర్జ్యతాండా గ్రామానికి చెందిన యూనియన్ ప్రెసిడెంట్ గా ధనావత్ గోవిందు నాయక్, ఉపాధ్యక్షులుగా ఇస్లావత్ హతీరాం నాయక్ ను ఎన్నుకున్నారు.