నెంబర్ ప్లేట్ లేని వాహనాలు సీజ్

69చూసినవారు
నెంబర్ ప్లేట్ లేని వాహనాలు సీజ్
నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే సీజ్ చేస్తామని మిర్యాలగూడ టూ టౌన్ సీఐ నాగార్జున హెచ్చరించారు. శనివారం టూటౌన్ పరిధిలో వాహన తనిఖీలు చేయగా నెంబర్ ప్లేట్లు లేకుండా నడుపుతున్న 15 ద్విచక్ర వాహనాలు పట్టుబడినట్లు తెలిపారు. ఇప్పటివరకు కౌన్సిలింగ్ ప్రక్రియతో ముగిసిన తనిఖీలు జూలై 1నుండి కట్టుదిట్టం కానున్నట్లు పేర్కొన్నారు. నెంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే సీజ్ చేయడంతో పాటు యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులంతా నెంబర్ ప్లేట్లను అమర్చి సంబంధిత ధ్రువపత్రాలను వెంటకలిగిఉండాలని ఆదేశించారు. తనిఖీల్లో ఎస్సైలు కృష్ణయ్య, రాంబాబు సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్