పదవి అనేది అలంకారం కాదు ఒక బాధ్యత. ఆ బాధ్యతను గుర్తించి ప్రజలకు మంచి చేయాలని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి కలిసి పాల్గొన్నారు.