మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో చండూరు మున్సిపాలిటీలోని పదిమంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు మంజూరు అయ్యాయి. ఆ చెక్కులను శుక్రవారం స్థానిక గెస్ట్ హౌస్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అనంత చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో అందజేశారు.