చండూరు: స్వపరిపాలన దినోత్సవ వేడుకలు

67చూసినవారు
చండూరు: స్వపరిపాలన దినోత్సవ వేడుకలు
విద్యార్థులకు స్వయం అనుభవం కోసమే స్వపరిపాలన దినోత్సవంను నిర్వహించినట్లు చండూరు మున్సిపాలిటీలోని గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. శనివారం గాంధీజీ విద్యాసంస్థలలో నిర్వహించిన స్వపరిపాలన దినోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ఒక్కరోజు పాలనలో విద్యార్థులు నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా, అధికారులుగా, ఉపాధ్యాయులుగా తమ పాత్రలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్