తుమ్మలపల్లి శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కమనీయంగా జరిగింది. పాల్గున మాసం, శుక్లపక్షం నాడు ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నల్గొండ జిల్లా చండూరు మండలం తుమ్మలపల్లి శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. వేకువజామునే వివిధ రకాల పుష్పాలతో స్వామివారికి అలంకరణ చేశారు. గురువారం తెల్లవారుజామున స్వామి అమ్మవార్ల కళ్యాణం వైభవంగా జరిగింది.