తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారందరికీ ఇంటి స్థలం ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారుడు కళ్లెం సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం చండూరులో మాట్లాడుతూ.. తెలంగాణ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని అతను కోరారు.