యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంబం అనిల్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమనికి భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.