బాబా సాహెబ్ అంబేద్కర్ చేత స్థాపించబడిన ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ 98వ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం తాలూకా కన్వీనర్ జిల్లా రాములు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సంఘం కార్యాలయంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డా. బుర్రి వెంకన్న సంఘం జెండా ఆవిష్కరణ చేసి గౌరవ వందనం చేశారు.