మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో శ్రీ లక్ష్మీ నారాయణ సహిత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ధనుర్మాసం చివరి రోజుని పురస్కరించుకుని భోగి పండుగ రోజున ఆదివారం రాత్రి శ్రీ గోదాదేవి-రంగనాయక స్వామి వార్ల కల్యాణాన్ని వేదపండితులు విజయరాఘవా చార్యులు, బొల్ల వెంకటేశం ఘనంగా నిర్వహించారు. గ్రామ మహిళలు పెద్దఎత్తున తరలి వచ్చి అమ్మవారికి తలంబ్రాలు సమర్పించారు.